Click Here: Kanche Teaser(Varun Tej, Pragya Jaiswal)
ఈ చిత్రం టీజర్ ను ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా చిత్ర బృందం విడుదల చేసింది. సుమారు 45 సెకండ్ల రన్ టైం ఉన్న ఈ టీజర్ కు సోషల్ మీడియా లో అద్భుతమైన స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ చాలా చోట్ల మెగాస్టార్ చిరంజీవి గారి పోలిక లో ఉండటం ఫాన్స్ ని ఎంతో ఎక్సైట్ చేస్తోంది.
బాలీవుడ్ లో ఇటివలే గబ్బర్ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.
భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు